GURUJNANAM - మార్గశిర దత్త పూర్ణిమ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు
మార్గశిర దత్త పూర్ణిమ -బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు
ఋషివాక్యం - సత్సాంగత్యం
సత్సాంగత్యం అనే మాట కేవలం ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిత్య జీవితానికి కూడా చాలా అవసరమైనటువంటిది. మోహజాలస్య యోనిర్హి మూఢైరేవ సమాగమః అహన్యహని ధర్మస్య యోనిః సాధు సమాగమః!! మోహజాలాన్ని పుట్టించే శక్తి మూర్ఖులతో సాంగత్యానికి ఉన్నది. ధర్మాన్ని కలిగించే శక్తి సత్పురుషులతో సాంగత్యానికి ఉన్నది. సత్యాన్ని తెలుసుకోలేకపోవడం, అసత్యాన్ని సత్యంగా అనుకోవడం మోహం. ప్రాజ్ఞైశ్చ వృద్ధైశ్చ సుఖ భావై తపస్విభిః సథ్భిశ్చ సహ సంసర్గః కార్యః శమ పరాయణైః!! ప్రాజ్ఞత(ఏది గొప్పదో తెలిసే లక్షణం), వృద్ధులై ఉండాలి(ధర్మం చేత, జ్ఞానం చేత పెద్దవారు మాత్రమే వృద్ధులు), ఉత్తమమైన స్వభావం కలిగిన వారు కావాలి, శాంతంగా ఉండేవారు కావాలి, తపస్వులై ఉండాలి – ఈ ఐదు లక్షణాలు ఎవరికి ఉంటాయో వారితో సాంగత్యం చేసినట్లయితే అది సత్సాంగత్యం అనిపించుకుంటుంది. నిరారమ్భా హ్యపి వయం పుణ్యశీలేషు సాధుషు పుణ్యమేవాప్నుయామేహ పాపం పాపోపసేవనాత్!! అగ్నిహోత్రాది కర్మలు చేయకపోయినప్పటికీ పుణ్యాత్ములైన సాధువులతో నివసించడం వల్ల మాకు ఆ అగ్నిహోత్రాది కర్మలు నిర్వహించిన ఫలితం లభిస్తున్నది అనే మాట ఉన్నది. దీని అర్థం సత్పురుషుల సాంగత్యం యజ్ఞయాగాది సత్కర్మాలతో సమానం. అసతాం థర్శనాత్ స్పర్శాత్ సంజల్పాత్ చ సహాసనాత్! ధర్మాచారాప్రహీయన్తే న చ సిధ్యన్తి చ న మానవాః!! ధర్మాచరణ మొదలుపెట్టి తరిద్దాం అనుకునే వారు జాగ్రత్త పడవలసిన విషయం ఏమిటంటే దుష్టులైన వారి దర్శనం కానీ, స్పర్శనం కానీ, సంభాషణ కానీ, సాంగత్యం కానీ కూడదు. ఇవి ఏవి చేసినా ధర్మాచారాలు హాని పొందుతాయి. సిద్ధిని ఇవ్వవు. సత్సాంగత్యాన్ని సమకూర్చుకోవాలి, దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాలి
ఆధివ్యాధులని పోగొట్టే నామత్రయాస్త్రం
ఆధివ్యాధులని పోగొట్టే నామత్రయాస్త్రం.అచ్యుత, అనంత, గోవింద నామాల చక్కటి వివరణ.. పూజ్యగురువులు వాగ్దేవీ వరపుత్ర డాక్టర్ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు 🙏🙏🙏
ఋషివాక్యం - త్యాగం
త్యాగేనైకే అమృతత్వ మానశుః – ఉపనిషద్వాక్యం వేదాంతమార్గంలో శ్రేయస్సు(మోక్షం) కావాలంటే త్యాగం అవసరం. మోక్షానికి త్యాగం ఆరు విధాలుగా ఉంటుంది అని సనత్సుజాతుడు చెప్తున్నారు. - ౧. సంపద పొందినప్పటికీ పొంగిపోకుండా ఉండడం ౨. తనకు వచ్చిన సంపదతో ఇష్టాపూర్త (లోకహిత, దైవహిత) కర్మలు చేయుట – అవి యజ్ఞయాగాదులు; బావులు, చెరువులు, తోటలు నిర్మించుట... ౩. వైరాగ్యంతో ఉండి కామాన్ని త్యజించడం. ౪. అప్రియమైన సంఘటన జరిగినప్పటికీ ఎటువంటి వ్యధనూ చెందకుండా ఉండుట. ౫. ఇతరులనుంచి ఏదీ యాచించకూడదు. ౬. అర్హుడైన యాచకుడు వచ్చినట్లయితే దానం చేయాలి. ఈ ఆరు త్యాగాలతో చేయవలసిన ధర్మము – సత్యము, ధ్యానము, సమాధి, తర్కము, వైరాగ్యం, అస్తేయం (దొంగతనం లేకపోవడం), బ్రహ్మచర్యం, సంపద కూడబెట్టకుండడం. అన్ని ధర్మాలకూ త్యాగం ఆలంబన
ఋషివాక్యం - సభ ఎలా ఉండాలి?
సభ ఎలా ఉండాలి? సభలు ఎందుకు చేస్తారు? సభ ఎప్పుడు అనిపించుకుంటుంది? న సా సభా యత్ర నసంతి వృద్ధా – వృద్ధులు లేనిది సభ కాదు. పెద్ద వారు అంటే ఎవరు? – న తే వృద్ధా యే నవదంతి ధర్మం – ఎవరైతే ధర్మాన్ని చెప్పరో వారు పెద్దలు కారు. సత్యము లేనిది ధర్మము కాదు. సత్యానికి కపటం ఉండరాదు. సత్యంతో కూడినదే ధర్మం అవుతుంది, ధర్మం ఉన్నవాళ్ళే వృద్ధులు అవుతారు, వృద్ధులు ఉన్నదే సభ అనిపించుకుంటుంది.
ఋషివాక్యం - విడిచి పెట్టవలసిన అష్ట దుర్లక్షణాలు
మానవుని ప్రగతికి విరోధములైనవి ఎనిమిది ఉన్నాయి. వాటిని దుర్గుణాలు అన్నారు. ఆ ఎనిమిది - మత్తాపానం కలహం పూగవైరం భార్యాపత్యోరన్తరం జ్ఞాతిభేదమ్ । రాజద్విష్టం స్త్రీపుమాంసోర్వివాదం వర్జ్యాన్యాహుర్యశ్చ పన్థాః ప్రదుష్ఠః!! మద్యపానం, కలహం, సమూహంలో వైరము, భార్యాభర్తల మధ్య భేదం కలిగించడం, కుటుంబ సభ్యులలో భేదాన్ని సృష్టించడం, పాలకుల పట్ల, దేశం పట్ల ద్వేషం కూడదు, స్త్రీపురుషుల మధ్య వివాదం ఏర్పరచడం, చెడు మార్గము. – ఇవి విడిచిపెట్టవలసినవి. వీటిపై ఆసక్తి కూడదు. మద్యపానం ఎలా దోషమో అలా పాలకులను ద్వేషించడం, దేశాన్ని ద్వేషించడం కూడా ఒకానొక ద్వేషమే. పక్షులు గూడు కట్టుకొని ఉంటూ ఉంటాయి కొమ్మలపై. వాటికి రెక్కలు రాగానే ఎగిరిపోతాయి. అదేవిధంగా కపటం కలిగిన వెంటనే వారి హృదయంలో ఉన్న వేదాది శాస్త్ర జ్ఞానం కూడా ఎగిరిపోతుంది. కనుక వంచన, కపటం లేని పాండిత్యం ఉండాలి.
ఋషివాక్యం - మానవునికి సిద్ధిని ఇచ్చే లక్షణములు
సత్యం దమ స్తపో దానం అహింసా ధర్మనిత్యతా! సాధకాని సదా పుంసాన్ న జాతిర్నకులం నృపా! (నహుషుడు ధర్మరాజుతో) మనుష్యులకు సిద్ధిని కలిగించేది జాతి కాదు, కులం కాదు. మానవునికి సిద్ధిని ఇచ్చే లక్షణములు – సత్యము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, దానము, అహింస, ధర్మ పరాయణత్వం. సిద్ధి పొందడానికి ఒక జాతియో, కులమో ప్రధానం కాదు, వ్యక్తిత్వం ప్రధానం. గొప్ప గొప్ప జాతులలో పుట్టినప్పటికీ ఈ గుణాలు లేకపోతే అతడు సిద్ధిని పొందడు. ఎలాంటి కష్టాన్ని అయినా తట్టుకుంటూ స్వధర్మాన్ని ఆచరించడమే తపస్సు. అలసత్వం ఉండరాదు, అప్రమత్తంగా ఉండాలి. సోమరితనాన్ని, ఏమరుపాటుతనాన్ని విడిచిపెట్టి అహింసను పాటిస్తూ సత్యము ఇత్యాది శుభకర్మలను ఆచరించే వారు సద్గతిని పొందుతారు. పాండవుల జయానికి కారణం ధర్మపరులు కావడమే.
ఋషివాక్యం జ్ఞాని బాలుడా? వృద్ధుడా?
జ్ఞాని బాలుడా? వృద్ధుడా? – అష్టావక్రుడు. “న జ్ఞాయతే కాయ వృద్ధ్యా వివృద్ధిః” – కేవలం శరీరం పెరగడమే మనిషి పెరిగినట్లు కాదు సుమా! (అష్టావక్రుడు) మానవుడు వయస్సు పెరిగిపోతోంది అని గమనించుకుంటూ వీలైనంత తొందరగానే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞాన వృద్ధులకు మాత్రమే గౌరవస్థానం. పెద్దగా పెరిగే బూరుగు చెట్ల వల్ల ప్రయోజనం లేదు. చిన్న చిన్న వృక్షాలే ఫలాలను ఇస్తూ ఉంటాయి. అందుకే ఎవరి నుంచి లోకానికి ఫలం లభిస్తుందో వాడు గొప్పవాడు కానీ ఎక్కువ కాలం బ్రతికిన వాడి వల్ల లోకానికి ప్రయోజనం చెప్పడానికి లేదు. జుట్టు తెల్లబడడం మాత్రాన వానిని పెద్దవాడు అనరాదు. వయస్సునందు బాలుడు అయినప్పటికీ జ్ఞానమునందు అధికుడు అయితే దేవతలు కూడా పెద్దవాడు అంటారు, గౌరవిస్తారు. వ్యాసభగవానుడు అష్టావక్రుడు, ఉపమన్యువు పాత్రల ద్వారా చెప్పదలచుకున్నది ఒక్కటే – “బాల్యంలోనే సాధనకి త్వరపడాలి”. వయస్సు పెద్దడవడం చేత కానీ, జుట్టు నెరవడం చేత కానీ, ధనం ఎక్కువగా ఉండడం చేత కానీ మనుజుడు గొప్పవాడు కాడు. సంపద ఎప్పుడూ జ్ఞానం ముందు తలవంచాలి. జ్ఞానాన్ని అవమానించినట్లయితే వయస్సులో ఎంత పెద్దవాడైనా, సంపన్నుడైనా దెబ్బతింటాడు. ధనము కంటే, వయస్సు కంటే భౌతిక సంపదల కంటే గొప్పది జ్ఞాన సంపద. అది పొందే ప్రయత్నం చేయాలి.
"నీలకంఠేశ్వరా!" శతకం పద్యం 43 - "Nilakanthesvaraa!" satakam padyam 43
విషం పుట్టడం, సిరులు కలగడం, వాటికై పోరాడడం, అమృతం జనించడం, దానికై సంఘర్షణ... అసలు విశ్వసముద్ర మథనంతో ఏర్పడే ఘర్షణలకు మూలం ఏమిటి? భోగలాలస, ఎక్కువకాలం బ్రతకాలనే పిచ్చికోరిక... ఈ సుఖలాలసత శాశ్వత పరతత్త్వాన్ని దక్కనిస్తుందా? ఈ మథనమే ఒక మాయ. ఈ నీ రహస్య రచన. దీనిని తొలగించితే చాలు కదా! ఈ విషాలూ, వాటిని నియమించడాలూ ఏవీ ఉండవు. పరమ సత్యమైన నీ తత్త్వమొక్కటి తెలిస్తే చాలు. నీలకంఠేశ్వరా!
Naa Maanasamuna Somaskandudu - నా మానసమున సోమాస్కందుడు sivapadam
Naa Maanasamuna Somaskandudu - నా మానసమున సోమాస్కందుడు sivapadam
గ్రహదోషాలు పోగొట్టగలిగే శ్లోకములు -బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు
గ్రహదోషాలు పోగొట్టగలిగే శ్లోకములు -బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు
ఋషివాక్యం - సర్వం విష్ణుమయం జగత్
అన్ని కాలాలూ భగవంతుని స్వరూపమే అని నిరంతరం భావిస్తే ప్రతి కాలమూ మనకు అనుకూలం అవుతుంది. అంతటా భగవానుడే అని భావించే వాడికి అంతటా భగవద్రక్ష లభిస్తుంది. దానికి ఉదాహరణ ప్రహ్లాదుల వారే. జలే విష్ణుః స్థలే విష్ణుః విష్ణుః పర్వతమస్తకే! జ్వాలమాలాకులే విష్ణుః సర్వం విష్ణుమయం జగత్!! (విష్ణుపంజర స్తోత్రం) జలములో విష్ణువు, స్థలములో విష్ణువు, పర్వతపు కొనపై విష్ణువు, అగ్ని జ్వాలల నడుమ విష్ణువు. మొత్తానికి సర్వం విష్ణుమయం జగత్!! ఇది నిరంతరం భావిస్తూ ఉంటే పంచభూతాలూ అతనిని ఏమీ బాధించవు. ఎందుకంటే ఇతరులకి పంచభూతాలే కనబడతాయి, భక్తుడికి పంచభూతాలలో భగవంతుడు కనబడతాడు.
ఋషివాక్యం సర్వం బ్రహ్మమయం జగత్
అన్నింటికీ సారవంతమైన వాక్యం ‘సర్వం బ్రహ్మమయం జగత్’. ‘బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే’ – భాగవతం. ‘ఈశావాస్యమిదం సర్వం’ – సమస్త విశ్వమూ ఈశ్వరునితోనే నిండి ఉన్నది. పురుష ఏ వేదగ్: సర్వమ్ I య ద్భూతం యచ్చభవ్యమ్ | - సర్వకాలాల్లోనూ సృష్టిలో సమస్తమూ పురుషుడే. పురుషుడు అంటే పరిపూర్ణుడైన పరమాత్మ. (పురుషసూక్తం) భగవానుని సర్వవ్యాపకునిగా అనుభవానికి తెచ్చుకోగలగడమే నిజమైన యోగసిద్ధి. అదే సర్వ శాస్త్రముల సారము.
ఋషివాక్యం భారతదేశపు ఆలయాలలో గొప్ప విజ్ఞానం ఉన్నది
మన ఆలయాలలో గొప్ప విశేషం ఏమిటంటే పెద్ద పెద్ద తుఫానులు మొదలైనవి వచ్చినప్పటికీ కూడా నిలబడి ఉండగలగడం విశేషమైన అంశం. ముఖ్యంగా స్వయంభూ క్షేత్రాలలో ఇది కనబడుతూ ఉంటుంది. భారతదేశపు ఆలయాలలో గొప్ప విజ్ఞానం ఉన్నది అని అంగీకరించక తప్పదు. ఆ విజ్ఞానం నేటి ఆధునికులకు ఉన్న జ్ఞానం కంటే గొప్పది అని ఒక్కసారి ప్రాచీనులైన భారతీయులకి నాస్తికులైనా దణ్ణం పెట్టక తప్పదు.
ఋషివాక్యం దేవాలయాలు - దేవతార్చన
దేవతార్చన మానవాళికి ముఖ్యమైన కర్తవ్యంగా చెప్పబడుతున్నది. ప్రతివారూ వారి ఇంట్లో రెండు పూటలా దేవతా సన్నిధిని కల్పించుకొని దీపాలు వెలిగించుకోవడం అనేది సంస్కృతిలో ప్రధానమైనటువంటి భాగం. న దేవో విద్యతే కాష్టే న పాషాణే న మృణ్మయే! భావే హి విద్యతే దేవస్తస్మాత్ భావోహి కారణం!! దేవత కర్రలోనో, రాయిలోనో ఉండదు. భావంలో ఉంటుంది. భావంలో ఉంటాడు కనుక బయట పూజలు అక్కరలేదు అని చెప్పరాదు. ఆలయ అర్చకులు తప్పకుండా శాస్త్రాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆ శాస్త్రాలు చెప్పినట్లు వాళ్ళు జీవిస్తూ ఉండాలి. అర్చకత్వం కడుపు నింపుకోవడం చేసే వృత్తి అనే భావన కాకుండా ప్రధానంగా అతడు అనుష్ఠాన పరుడై ఉండాలి. తాను ఆరాధించే దేవతయందు తాను ముందు విశ్వాసం కలిగి ఉండాలి. నిర్దేశించినటువంటి ఆగమ పద్ధతులు అతిక్రమించకుండా చూడడమే నియంత్రణ. క్రొత్త పథకం పెడితే మరింత రాబడి వస్తుంది అంటూ ప్రాచీనమైన పద్ధతులను దెబ్బతీయరాదు. మన సౌకర్యాల కోసం కట్టడాలు కానీ, విగ్రహాలు కానీ స్థానభ్రంశం చెందరాదు. మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనకు ఉన్నది.
ఋషివాక్యం దేవాలయం
ఆలయం బాగుంటేనే ఊరు బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. హైందవ ఆలయాలను ప్రార్థనా మందిరాల వలె చూడరాదు. అవి విజ్ఞాన కేంద్రాలు, శక్తి కేంద్రాలు.
ఋషివాక్యం కళలు ధర్మం అనే ప్రాతిపదిక మీద ఆధారపడి ఉండాలి. పరమార్థ ప్రయోజనంతో వెళ్ళాలి
ఉద్వేగము, ఉద్రేకము, కళాసౌందర్యము ఒక్కొక్కప్పుడు మధురంగా అనిపించవచ్చు కానీ ధర్మం నుంచి పతనం చేయవచ్చు. అందుకే కావ్యాలకు, సంగీతాలకు దూరంగా ఉండాలని శాస్త్రం వర్ణిస్తోంది – ‘కావ్యాలాపాంశ్చ వర్జయేత్’ ఒకవైపు కావ్యాలు, సంగీతాలు పతనహేతువులు అని చెప్తూ మరొకవైపు ఆ సంగీతాది కళలతోనే తరించిన మహాత్ములు, సత్కావ్యాలు రచించినటువంటి అనేకమంది మహానుభావులు మనకు కనబడుతున్నారు. ఏమిటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి? అనే భావన కలుగవచ్చు. ‘కావ్యాలాపాంశ్చ వర్జయేత్’ – అని శాస్త్రములు హెచ్చరిస్తున్నాయి కానీ అది ‘అసత్కావ్య విషయాంశ్చ’ అన్నారు మల్లినాథసోమసూరి అనే మహా పండితుడు కాళిదాస వాజ్ఞ్మయానికి వ్యాఖ్యానం వ్రాస్తూ. భారతీయత ఎప్పుడూ కూడా ఎంత విజ్ఞానం సంపాదించినా, ఎన్ని కళలు సాధించినా, ఎంత ప్రగతి సాధించినా ధర్మం అనే ప్రాతిపదిక మీద ఆధారపడి ఉండాలి. పరమార్థ ప్రయోజనంతో వెళ్ళాలి అని శాసించారు. భారతదేశంలో భిన్న భిన్న భాషలు, భిన్న భిన్న రాష్ట్రాలు ఉన్నా వారందరూ కూడా ఏకోన్ముఖంగా ధర్మ ప్రయోజనంతోనే రచించారు. అందుకే ఆ వాజ్ఞ్మయాలు మన జీవితాలను శాసిస్తూ ధర్మాన్ని ప్రబోధిస్తూ ప్రేరేపిస్తూ ఉన్నాయి. సరియైన సమయంలో సరియైన మార్గనిర్దేశకత్వం చేస్తున్నాయి.
GURUJNANAM- శ్రీ మద్భగవద్గీత 2వ అధ్యాయము: సాంఖ్య యోగము భాగం - 2/5 శ్లోకములు 17-34
శ్రీ మద్భగవద్గీత 2వ అధ్యాయము: సాంఖ్య యోగము భాగం - 2/5 శ్లోకములు 17-34 బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు Srimad Bhagavad Gita Chapter 2:Sānkhya Yog Part - 2/5 Slokas 17-34 Pravachanam By Brahmasri Samavedam Shanmukha Sarma Guruvu Garu
అక్షర దేవతలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగురువు గారు
అక్షర దేవతలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగురువు గారు For Intro song Shabdabrahma avirbhavam from Shivapadam Vol 12 https://rushipeetham.com/product/sambhoo-sivaa-e-download/?v=7516fd43adaa For Akshaarabhyaasam CD https://rushipeetham.com/product/aksharabhyasam/?v=7516fd43adaa For more Information Please visit https://rushipeetham.com