"Srimad Bhaagavatham" Pravachanam LIVE from Rajamahendravaram

If LIVE video is stopped or interrupted please REFRESH / RESTART the page. Live Streaming will also be available on GURUVU gari facebook official page.


Sunday, 19 May 2019 8:54 pm

శివ పదం - జీవన పథం

నేను విజయవాడలో ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో 1993వ సంవత్సరంలో ఎందుకో చెన్నై నగరం రావాలి అని కోరిక పుట్టి, రావడం జరిగింది. అక్కడకు వచ్చిన నాకు ఎందుకో కాంచీపురం వచ్చి స్వామివారిని చూడాలని అనిపించింది. అంతకు కొద్ది కాలం నుంచే స్వామివారి దివ్యమైన లీలలు, మహిమలు విజయవాడ నగరంలో కొందరు మిత్రుల ద్వారా తెలుసుకున్న తరువాత వారిని ఎలాగైనా దర్శించాలనే కోరిక అప్పుడు నెరవేరింది. నేను వచ్చాను అని నేను భావించడంలేదు జన్మాంతరంలో ఏం సుకృతముందో వారు ఇక్కడకు రప్పించారు అని ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసింది.

అలా వచ్చినప్పుడు, నాకు ఇప్పటికి గుర్తు ఆ ప్రాంతంలో శ్రీవారు కూర్చుని ఉన్నారు, మౌనంలో ఉన్నారు. అది మధ్యాహ్న సమయం. షుమారు అక్టోబరు ఆ మాసంలో. భక్తుల వరుస ఎక్కువగా ఉన్నది అక్కడ చివరి వరకు కూడా. ఆ వరుసలో నేను కూడా నిలబడి, ముందుకు వస్తూ ఉంటే, అప్పుడు నేను చేతివ్రాతలో ఉన్న “శివపదం” కీర్తనలు మొత్తం పట్టుకుని ఉన్నాను. సరిగ్గా ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి, వరుసలో నుండే కొంతదూరం నుండి శ్రీవారి దర్శనమవుతున్నది.

మహాతేజోమయమైన ఆ మూర్తిని చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఇంతమందిలో నన్ను ప్రత్యేకంగా నన్ను చూశారు అని స్పష్టమైన, గాఢమైన అనుభూతి కలిగింది. ఇప్పటికి మర్చిపోలేను అది. నన్నే చూస్తున్నారు నాపై ఆయనకు అఖండమైన వాత్సల్యమున్నది. అది ఎప్పట్నించో నన్ను వాత్సల్యంతో గమనిస్తున్న చూపే ఇప్పుడు నేను ప్రత్యేక్షంగా చూస్తున్నాను అనే అనుభవం కలిగింది. అప్పుడు కేవలం ఆ చేత్తో గ్రంథం పట్టుకోగానే నానోట ఆప్రయత్నంగా వెలువడినటువంటి శ్లోకం,

మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||

ఇదే అప్రయత్నంగా వెలువడుతూంటే చిత్రం ఆ హడావిడిలో ప్రతివారు దర్శనం చేసి వెళ్ళిపోవడమే జరుగుతోంది అక్కడ. ఆయన సమీపంలో ఉన్నటువంటి ఒక మహాత్ములేవరో లోపలనుండి వచ్చారు. వచ్చి మీ చేతిలో ఉన్న పుస్తకాన్ని స్వామివారు అడుగుతున్నారు అన్నారు. నేను ఆశ్చర్యపోయి చేతివ్రాతలో ఉన్న గ్రంథాన్ని ఆయన చేతిలో పెట్టాను. అక్కడ శ్రీవారి సమీపానికి వెళితే దాన్ని తాకి, వారు దానిమీద చేతితో కుంకుమని, పటికబెల్లాన్ని వేసి తిరిగి నాకు పంపించారు.

ఆ “శివపదం” ముందు వారి చేతి స్పర్శ చేత ధన్యమైంది. అటు తరువాత కేవలం ఆధ్యాత్మికతని మొదలైన వాటిని నా వ్యక్తిగత సాధన కోసం ఉపయోగించుకుంటూ మిగిలిన జీవన వ్యవహారాలు మిగిలిన వాటిలో ఉందామని భావించిన నాకు, అటుతరువాత నా జీవితమంతా భగవత్ సాధనగా ఆ క్షణం నుంచే మారడం జరిగింది. కనుక ఈ జీవితం ఆయన చేతి స్పర్శతో మలచబడి సాగుతున్నదని భావిస్తూ ఎక్కడున్నా ఎలా ఉన్నా నన్ను శ్రీవారు నడిపిస్తున్నది, వారు నన్ను గమనిస్తున్నారను స్పృహ ఆనాటి నుంచి కలుగుతున్నది.

ఆ తరువాత ఆశ్చర్యకరంగా నేను చెన్నై నగరం రావడం, వచ్చిన తరువాత గురువుగారి చరణాలకి మరింత సన్నిధియై ఒక్కొక్కప్పుడు ఆ చరణాల్లో “నిమజ్జన్మ జీవః కరణ చరణైహి శత్చరణతాం” అన్నట్లుగా ఆ చరణాల్లో లినమైపోతున్నామా అన్నంత అనుభూతి నాకు కలిగించడానికి చంద్రశేఖర యతీంద్ర స్వామివారి విషయంలో నాకు గురు స్వరూపమైనటువంటి వారు చల్లా విశ్వనాథ శాస్త్రిగారు.

నాకు స్పష్టంగా తెలిసినది, తరువాత అనేకమంది మహాపండితులు, పెద్దలు వీరందరి ద్వారా నేను గ్రహించింది ఏమిటంటే పరమాచార్యుల విషయంలో పరమ ప్రామాణికంగా ఏదైనా ఒక మహా విషయాన్ని తెలియజేయాలంటే దానికి సర్వ సమర్థులు విశ్వనాథ శాస్త్రిగారని మాకు స్వానుభవంతో తెలుసు.

--- బ్రహ్మశ్రీ సామవేదం శణ్ముఖశర్మ గారు

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


264 16 47

Sunday, 19 May 2019 6:00 pm


201 9 33

Sunday, 19 May 2019 3:00 pm


153 4 32

Sunday, 19 May 2019 2:00 pm


299 6 41

Sunday, 19 May 2019 1:51 pm

ధర్మ రక్షణ - దేశ రక్షణ

ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివి అంటే, మొట్టమొదట స్వాతంత్ర్యోద్యమాలు స్వామి వివేకానంద స్ఫూర్తితో ఉద్భవించినప్పుడు “సనాతన ధర్మంతో కూడిన అచ్చమైన భారత దేశాన్ని” రక్షించుకోవాలనే తపనే ఆనాడు ఉన్న మహాత్ములది. కాని తరువాత తరువాత స్వాతంత్ర్యోద్యమం ధర్మమయమైన దేశాన్ని సాధించడం అనేటువంటి మూర్తిని విడిచిపెట్టి మరొక రూపం తీసుకుంది.

అది కేవలం రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. “ఈ రాజకీయోద్యమం ఇలాగే కొనసాగి కాని మనకు స్వాతంత్ర్యం సిద్ధిస్తే, మన ధర్మం ఏమవుతుంది” అని ఆలోచించిన వాళ్ళు ఈ స్వాతంత్ర్యోద్యమ సమయానికి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. గట్టి సంఖ్యలో చెప్పుకోలేము. అందులో యతీశ్వరులు మహాత్ములు మా పీఠాలేమైపోతాయో అని బాధపడేవాళ్ళే చాలామందున్నారు కాని, స్వాతంత్ర్యం సిద్ధిస్తే ఈ సనాతన ధర్మం ఏమౌతుంది? ఎటువంటి రాజ్యాంగం తయారవుతుంది? ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి వాతావరణమే తప్ప ధార్మికమైన వాతావరణం లేదు. అలాంటి స్థితిలో ఈ దేశంలో ఈ సనాతాన హైందవ ధర్మం రక్షింపబడాలి అనే తపన పడ్డటువంటి ఏకైక ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు.

మహిమలు చూపే విషయములే కాకుండా ధర్మరక్షణకు వారు చేసినవే మనం తెలుసుకోవలసింది. ఇది చాలా స్ఫూర్తి. అసలు దేశభక్తి లేనివారికి దైవభక్తి లేనట్టే లెక్క. ఒకవేళ దైవభక్తి ఏదైనా ఉంటే, వాడిల్లు వాడి కుటుంబం క్షేమంగా ఉండడం కోసం చూసిన భక్తియే తప్ప ఇక ఏది లాభం లేదు దానివల్ల. అందుకు ప్రధానంగా ఈ దేశం క్షేమంగా ఉండాలి. ధర్మం క్షేమంగా ఉండాలని ముందు కోరుకోవాలి. ఎలాగైతే మన ఇంట్లో ఉన్న మనం నేను క్షేమంగా ఉండాలి అని ఎంత కోరుకుంటామో నా ఇల్లు క్షేమంగా ఉండాలని అంతే కోరుకోవాలి.

లేకపోతే మీ జపం మీరు చేస్తుంటే మీ ఇంటి పైకప్పు ఊడి నెత్తిమీద పడితే, ఎవడు రక్ష. అందుకు మన జపం మనకు సాగుతున్నా, మన ఇల్లంతా బాగుండాలని ఎలా అనుకుంటామో, ఈ దేశమంతా ధర్మమంతా బాగుండాలని కోరుకోవాలి. అందుకే వయుక్తిక మోక్షం కోసం సాధన చేయడం ఎంత అవసరమో, సామాజికమైన దేశ క్షేమం కోసం సాధన చెయ్యడం అంత అవసరం.

అందులో పీఠాధిపతి వ్యవస్థని ఆదిశంకర భగవత్పాదులు వారు ఆ కారణం చేతనే ఏర్పాటు చేశారు. నాలుగు వైపుల్నుంచి కూడాను భారతదేశాన్ని రక్షించడం కోసమే ఆయన పీఠములను ప్రతిష్టాపన చేశారిక్కడ. అటువంటి శంకరుల హృదయం తెలిసినటువంటి శంకరులు మళ్ళి అవతరించిన శంకరులు. మాకనిపిస్తుంది కేవలం ముప్పైరెండేళ్ళు ఉండి చెయ్యాల్సిందంతా చేసి నేను వెళ్ళిపోయాను.

కాని కలి ముదిరిపోతోంది. ముప్పైరెండేళ్ళ ఉనికి చాలదు. ఒక సంపూర్ణమైన శతవర్ష ఆయుః పరిమితితో కూడిన ఉనికి కావాలి అని అనుకున్న శంకరులు మళ్ళి చంద్రశేకరేంద్ర సరస్వతి స్వామివారిగా అవతరించారు. ఇందులో సందేహం లేదు.

--- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనం నుండి

#KanchiParamacharyaVaibhavam


347 23 52

Sunday, 19 May 2019 10:00 am


251 6 46

Sunday, 19 May 2019 8:17 am

నేడు వైశాఖ బహుళ పాడ్యమి ( కృష్ణ పక్ష పాడ్యమి ) కంచికామకోటి పీఠాధిపతి
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి గారి జన్మ తిధి. వినమ్ర మనఃపూర్వక ప్రణామాలు.🌹🌹💐💐


1086 169 215

Sunday, 19 May 2019 7:00 am

శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు – ధర్మ రక్షణ

ఋషివాక్యం - శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు – ధర్మ రక్షణ


164 5 47

Sunday, 19 May 2019 6:00 am

శ్రీచన్ద్రశేఖరేన్ద్రసరస్వత్యష్టోత్తరశతనామావలిః ॥

మహాస్వామిపాదాష్టోత్తరశతనామావలిః

శ్రీకాఞ్చీకామకోటిపీఠాధీశ్వర జగద్గురు
శ్రీశ్రీచన్ద్రశేఖరేన్ద్రసరస్వతీ అష్టోత్తరశత నామావలిః ।

ఓం శ్రీకాఞ్చీకామకోటిపీఠాధీశ్వరాయ నమః ।
ఓం శ్రీచన్ద్రశేఖరేన్ద్రసరస్వతీగురుభ్యో నమః ।
ఓం సంన్యాసాశ్రమశిఖరాయ నమః ।
ఓం కాషాయదణ్డధారిణే నమః ।
ఓం సర్వపీడాపహారిణే నమః ।
ఓం స్వామినాథగురవే నమః ।
ఓం కరుణాసాగరాయ నమః ।
ఓం జగదాకర్షణశక్తిమతే నమః ।
ఓం సర్వసరాచరహృదయస్థాయ నమః ।
ఓం భక్తపరిపాలకశ్రేష్ఠాయ నమః । ౧౦
ఓం ధర్మపరిపాలకాయ నమః ।
ఓం శ్రీజయేన్ద్రసరస్వత్యాచార్యాయ నమః ।
ఓం శ్రీవిజయేన్ద్రసరస్వతీపూజితాయ నమః ।
ఓం శివశక్తిస్వరూపాయ నమః ।
ఓం భక్తజనప్రియాయ నమః ।
ఓం బ్రహ్మవిష్ణుశివైక్యస్వరూపాయ నమః ।
ఓం కాఞ్చీక్షేత్రవాసాయ నమః ।
ఓం కైలాశశిఖరవాసాయ నమః ।
ఓం స్వధర్మపరిపోషకాయ నమః ।
ఓం చాతుర్వర్ణ్యసంరక్షకాయ నమః । ౨౦
ఓం లోకరక్షణసఙ్కల్పాయ నమః ।
ఓం బ్రహ్మనిష్ఠాపరాయ నమః ।
ఓం సర్వపాపహరాయ నమః ।
ఓం ధర్మరక్షణసన్తుష్టాయ నమః ।
ఓం భక్తార్పితధనస్వీకర్త్రే నమః ।
ఓం సర్వోపనిషత్సారజ్ఞాయ నమః ।
ఓం సర్వశాస్త్రగమ్యాయ నమః ।
ఓం సర్వలోకపితామహాయ నమః ।
ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః ।
ఓం బ్రహ్మణ్యపోషకాయ నమః । ౩౦
ఓం నానవిధపుష్పార్చితపదాయ నమః ।
ఓం రుద్రాక్షకిరీటధారిణే నమః ।
ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వచరాచరవ్యాపకాయ నమః ।
ఓం అనేకశిష్యపరిపాలకాయ నమః ।
ఓం మనశ్చాఞ్చల్యనివర్తకాయ నమః ।
ఓం అభయహస్తాయ నమః ।
ఓం భయాపహాయ నమః ।
ఓం యజ్ఞపురుషాయ నమః । ౪౦
ఓం యజ్ఞానుష్ఠానరుచిప్రదాయ నమః ।
ఓం యజ్ఞసమ్పన్నాయ నమః ।
ఓం యజ్ఞసహాయకాయ నమః ।
ఓం యజ్ఞఫలదాయ నమః ।
ఓం యజ్ఞప్రియాయ నమః ।
ఓం ఉపమానరహితాయ నమః ।
ఓం స్ఫటికతులసీరుద్రాక్షహారధారిణే నమః ।
ఓం చాతుర్వర్ణ్యసమదృష్టయే నమః ।
ఓం ఋగ్య़జుస్సామాథర్వణచతుర్వేదసంరక్షకాయ నమః ।
ఓం దక్షిణామూర్తిస్వరూపాయ నమః । ౫౦
ఓం జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థాతీతాయ నమః ।
ఓం కోటిసూర్యతుల్యతేజోమయశరీరాయ నమః ।
ఓం సాధుసఙ్ఘసంరక్షకాయ నమః ।
ఓం అశ్వగజగోపూజానిర్వర్తకాయ నమః ।
ఓం గురుపాదుకాపూజాధురన్ధరాయ నమః ।
ఓం కనకాభిషిక్తాయ నమః ।
ఓం స్వర్ణబిల్వదలపూజితాయ నమః ।
ఓం సర్వజీవమోక్షదాయ నమః ।
ఓం మూకవాగ్దాననిపుణాయ నమః ।
ఓం నేత్రదీక్షాదానాయ నమః । ౬౦
ఓం ద్వాదశలిఙ్గస్థాపకాయ నమః ।
ఓం గానరసజ్ఞాయ నమః ।
ఓం బ్రహ్మజ్ఞానోపదేశకాయ నమః ।
ఓం సకలకలాసిద్ధిదాయ నమః ।
ఓం చాతుర్వర్ణ్యపూజితాయ నమః ।
ఓం అనేకభాషాసమ్భాషణకోవిదాయ నమః ।
ఓం అష్టసిద్ధిప్రదాయకాయ నమః ।
ఓం శ్రీశారదామఠసుస్థితాయ నమః ।
ఓం నిత్యాన్నదానసుప్రీతాయ నమః ।
ఓం ప్రార్థనామాత్రసులభాయ నమః । ౭౦
ఓం పాదయాత్రాప్రియాయ నమః ।
ఓం నానావిధమతపణ్డితాయ నమః ।
ఓం శ్రుతిస్మృతిపురాణజ్ఞాయ నమః ।
ఓం దేవయక్షకిన్నరకింపురుషపూజ్యాయ నమః ।
ఓం శ్రవణానన్దకరకీర్తయే నమః ।
ఓం దర్శనానన్దాయ నమః ।
ఓం అద్వైతానన్దభరితాయ నమః ।
ఓం అవ్యాజకరుణామూర్తయే నమః ।
ఓం శైవవైష్ణవాదిమాన్యాయ నమః ।
ఓం శఙ్కరాచార్యాయ నమః । ౮౦
ఓం దణ్డకమణ్డలుహస్తాయ నమః ।
ఓం వీణామృదఙ్గాదిసకలవాద్యనాదస్వరూపాయ నమః ।
ఓం రామకథారసికాయ నమః ।
ఓం వేదవేదాఙ్గాగమాది సకలకలాసదఃప్రవర్తకాయ నమః ।
ఓం హృదయగుహాశయాయ నమః ।
ఓం శతరుద్రీయవర్ణితస్వరూపాయ నమః ।
ఓం కేదారేశ్వరనాథాయ నమః ।
ఓం అవిద్యానాశకాయ నమః ।
ఓం నిష్కామకర్మోపదేశకాయ నమః ।
ఓం లఘుభక్తిమార్గోపదేశకాయ నమః । ౯౦
ఓం లిఙ్గస్వరూపాయ నమః ।
ఓం సాలగ్రామసూక్ష్మస్వరూపాయ నమః ।
ఓం కాలట్యాంశఙ్కరకీర్తిస్తమ్భనిర్మాణకర్త్రే నమః ।
ఓం జితేన్ద్రియాయ నమః ।
ఓం శరణాగతవత్సలాయ నమః ।
ఓం శ్రీశైలశిఖరవాసాయ నమః ।
ఓం డమరుకనాదవినోదాయ నమః ।
ఓం వృషభారూఢాయ నమః ।
ఓం దుర్మతనాశకాయ నమః ।
ఓం ఆభిచారికదోషహర్త్రే నమః । ౧౦౦
ఓం మితాహారాయ నమః ।
ఓం మృత్యువిమోచనశక్తాయ నమః ।
ఓం శ్రీచక్రార్చనతత్పరాయ నమః ।
ఓం దాసానుగ్రహకారకాయ నమః ।
ఓం అనురాధానక్షత్రజాతాయ నమః ।
ఓం సర్వలోకఖ్యాతశీలాయ నమః ।
ఓం వేఙ్కటేశ్వరచరణపద్మషట్పదాయ నమః ।
ఓం శ్రీత్రిపురసున్దరీసమేతశ్రీచన్ద్రమౌలీశ్వరపూజప్రియాయ నమః ॥

ఇతి శ్రీకాఞ్చీకామకోటిపీఠాధీశ్వర జగద్గురు శఙ్కరాచార్య
శ్రీచన్ద్రశేఖరేన్ద్రసరస్వత్యష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా ॥


566 71 120

Sunday, 19 May 2019 5:00 am


336 11 72
Back