"నీలకంఠేశ్వరా!" శతకం పద్యం 23 - "Nilakanthesvaraa!" satakam padyam 23

ఓ హాలాహలమా! నీ భాగ్యానికి నమస్కారం. అమృతానికి దేవతల భోజనం అని పేరు వచ్చింది. నీకు మాత్రం శివునకు ఆహారమయ్యావనే బిరుదు మిగిలింది. శివకంఠాన చేరి రత్నానివయ్యావు. నీలకంఠేశ్వరా!

Mahishasura Mardini Stotram Slokam-15

Mahishasura Mardini Stotram Slokam-15

ఋషివాక్యం వ్యక్తిత్వం ఎలా ఉండాలి? ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?

ఋషివాక్యం వివాహాలు, వరకట్నం, కన్యాశుల్కం

ఋషివాక్యం భారతీయ సమాజానికి మహాస్వామి వారి సమైక్యతా బోధ

ఋషివాక్యం పిల్లల్ని ఏవిధంగా తీర్చిదిద్దాలో తల్లిదండ్రులకు జగద్గురువుల బోధ

GURUJNANAM - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు పుట్టిన రోజు స్పెషల్

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు పుట్టిన రోజు స్పెషల్

Lalithasahasranamam

Sangeetha Bharathi NZ Brahmashree Samavedam Gari Pravachanam 17Mar19 Lalithasahasranamam

Pujya Guruvula Janmadina Anugraha Bhashanam

Pujya Guruvula Janmadina Anugraha Bhashanam 2019-May-11

Vishnusahasranamam

Sangeetha Bharathi NZ (16-Mar-2019)

"నీలకంఠేశ్వరా!" శతకం పద్యం 22 - "Nilakanthesvaraa!" satakam padyam 22

నీ నామామృతాన్ని నిష్ఠతో ఆస్వాదించే భక్తుడు ద్వంద్వాతీతుడై సుఖదుఃఖాలను అధిగమిస్తాడు. ఆనందామృత సముద్రుడవైన నీకు విషమేపాటి! నువ్వనే సముద్రాన్ని నా హృదయంలో దాచుకుంటాను. నీలకంఠేశ్వరా!

Mahishasura Mardini Stotram Slokam-14

Mahishasura Mardini Stotram Slokam-14

ఋషివాక్యం: ప్రకృతి పట్ల మానవుని బాధ్యత

ఋషివాక్యం: మహాస్వామి వారు సామాన్యుల పట్ల ఎటువంటి కరుణ కలిగి ఉంటారు?

ఋషివాక్యం: మహాస్వామి వారు సామాన్యుల పట్ల ఎటువంటి కరుణ కలిగి ఉంటారు?

ఋషివాక్యం: స్వధర్మాచరణయే సద్గతికి హేతువు

ఋషివాక్యం: శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ మహాస్వామి వారి మహిమల ద్వారా సందేశం

ఋషివిజ్ఞానం: సూర్యసంబంధ విజ్ఞానం – సూర్యోపాసనా రహస్యాలు

ఋషివాక్యం: వాక్కు యొక్క మహిమ – సత్య వ్రతం

రామ వ్యక్తిత్వాన్ని చెప్పే మహావాక్యం.... ఉత్తముడైన వాడు ఒక మాటకు కట్టుబడితే ఎట్టి పరిస్థితులలోనూ దాని నుంచి చలించడు. నిబద్ధతయే(commitment) సత్యం. వాక్కు అగ్ని. జాగ్రత్తగా సంరక్షించుకుంటే అగ్ని మనకి వండి ఇస్తుంది. జాగ్రత్తగా వాడుకోలేక పోతే కొంపలు తగులబడుతుంది. అలాగే వాక్కు కూడా. సత్యము, హితము అయినప్పుడు తప్పకుండా రక్షిస్తుంది.

GURUJNANAM - Adi Shankaracharya Jayanti

GURUJNANAM - Adi Shankaracharya Jayanti

ఋషివాక్యం : యక్ష ప్రశ్నలు

భూమికంటే బరువైనది ఏది? ఆకాశంకంటే ఎత్తైనది ఏది? వాయువుకంటే వేగమైనది ఏది? గడ్డిపోచకంటే అల్పమైనది ఏది? తల్లిదండ్రుల స్థానం ఎలాంటిది?

GURUJNANAM - Akshaya Trutiya Importance

GURUJNANAM - Akshaya Trutiya Importance

వందే మాతరం! ముగ్గురు అమ్మల భారతమాత. Vandē mātaraṁ! Mugguru am'mala bhāratamāta

వందే మాతరం! ముగ్గురు అమ్మల భారతమాత. Vandē mātaraṁ! Mugguru am'mala bhāratamāta

"నీలకంఠేశ్వరా!" శతకం పద్యం 21 - "Nilakanthesvaraa!" satakam padyam 21

అశుభం నిన్ను చేరితే శుభమౌతుంది. నువ్వు చేరితే వల్లకాడు పవిత్రసదనమయింది. బూడిద విభూతి అయింది. నాగులు, పుఱ్ఱెలు నగలయ్యాయి. విషంతో కూడిన మసి (మశి) మాణిక్యమయింది. నీలకంఠేశ్వరా!

Mahishasura Mardini Stotram Slokam-13

Mahishasura Mardini Stotram Slokam-13

ఋషివాక్యం తిరుమల – వృక్ష సంపద వృక్ష ప్రసాదం

ఋషివాక్యం: వశ్యాత్మా, ధర్మాత్మా

వశ్యాత్మా, ధర్మాత్మా – ఈ రెండు లక్షణములు కలిగిన వారు జీవితంలో విజయం సాధిస్తారు. వశ్యాత్మా – నిగ్రహింపబడిన మనస్సు కలిగినటువంటి వారు. ధర్మాత్మా – ధర్మమును ఆచరించే స్వభావం కలిగినటువంటి వారు. ఈ రెండూ జీవితంలో సుఖానికి మూలమైన అంశములు.

ఋషివాక్యం భక్తివైభవం

భక్తి లేని వారి ప్రతిభాపాటవాలు కానీ; కవిత్వం, సంగీతం వంటి కళలు కానీ లోకానికి చూపించే అలంకారాలే తప్ప భగవదనుగ్రహానికి పాత్రములు కావు. భగవద్భక్తి లేకుండా యజ్ఞయాగాదులు, ఉపవాసాలు చేయడం శరీరాన్ని కష్టపెట్టుకోవడమే తప్ప ప్రయోజనం లేదు. ఎన్ని ఆచార వ్యవహారాలు పాటించినా భక్తి లేనప్పుడు అవన్నీ వ్యర్థము. గొప్ప ఆచారాలు పాటించకపోయినప్పటికీ దృఢభక్తి, జితేంద్రియ లక్షణం ఉన్నవాడు చాలా గొప్పవాడు. దీనిని బట్టి హిందూమతంలో కులానికీ, ఆచారానికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. భక్తికి ప్రాధాన్యం ఇచ్చారు. భక్తి కులం కంటే, ఆచారం కంటే గొప్పది. భక్తి ఉన్నవాడు ఆచారాలు పాటించకూడదు అని చెప్పడం కాదు. భక్తి లేకుండా ఆచారాలు పాటిస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. భక్తికోసం ఆచారం, భక్తితో చెయ్యి అని చెప్పారు. అష్టాదశ విద్యలలో పండితుడైనా, ప్రపంచాన్ని ఏలే రాజు అయినప్పటికీ కూడా భక్తి లేనప్పుడు వాడు గొప్పవాడు అనిపించుకోడు. యయా వేత్తి జగన్నాథం సా విద్యా పరికీర్తితా! యేన ప్రీణాతి భగవాన్ తత్ కర్మా అశుభ నాశనం!! ఏ విద్య జగన్నాథుని తెలియజేస్తుందో ఆ విద్యయే విద్య. అది కాని విద్యలన్నీ వ్యర్థములే. ఏ కర్మ భగవత్ ప్రీతిగా చేస్తారో ఆ కర్మయే నిజమైన కర్మ.

ఋషివాక్యం: తల్లిదండ్రుల ప్రవర్తనా సరళి – సంతానం

ఋషివాక్యం: నియమాత్ శ్రేయమాప్నోతి నియమం వల్ల శ్రేయస్సు లభిస్తుంది

ఋషివాక్యం: దేహనింద

ఋషివాక్యం భారతదేశ ధర్మవిజ్ఞానం

ఋషివాక్యం పరిపాలనా విధానం – ధనార్జన

"నీలకంఠేశ్వరా!" శతకం పద్యం 20 - "Nilakanthesvaraa!" satakam padyam 20

పూలు వేసిన (కుసుమబాణాలు వేసిన) మన్మథుని తగలబెట్టావు. తగలబెట్టే విషాన్నిచ్చిన దేవతలను అనుగ్రహించావు. నీవు భావాన్ని దర్శిస్తావు. వస్తువును కాదు. పూలైన, విషమైనా నీకు ఒకటే. ప్రదర్శించిన మదనుని అహంకారాన్ని దగ్ధం చేశావు. శరణువేడిన సురాసురుల దైన్యాన్ని చూసి దయచూపావు. నీలకంఠేశ్వరా!

అచల! అరుణ! అరుణాచల! acala! aruṇa! aruṇācala!

అచల! అరుణ! అరుణాచల! acala! aruṇa! aruṇācala! https://rushipeetham.com/product/sivapadam-sambadevambhaje-e-download/#prettyPhoto

Mahishasura Mardini Stotram Slokam-12

Mahishasura Mardini Stotram Slokam-12

ఋషివాక్యం: భోగశరీరాన్ని యోగశరీరంగా దర్శించడానికి ఋషులు తెలియజేసిన విధానం

ఋషివాక్యం: ప్రాచీనమైన యోగవిద్య, వైద్య విద్య

పెద్దలు ఏర్పరచిన నియమాలు ప్రాచీనమైన యోగవిద్య, వైద్య విద్య .... ఏ మచ్చా లేని, సంతానం బ్రతికి ఉన్న ఆవు యొక్క పాలు పుష్యమీ నక్షత్రం నాడు తీసుకుంటే కొన్ని రకాల రుగ్మతలు తొలగుతాయి.

ఋషివాక్యం: ఈశ్వర స్పృహ, ఈశ్వర బంధం

ఈశ్వర బంధం వల్లనే శాంతిగా, తృప్తిగా ఉండగలం. నిరంతరం ఈశ్వరుడు ఉన్నాడు అనే స్పృహతో జీవించడమే నిజమైన ఈశ్వరారాధన. ఈశ్వరుడు ఒక్కడే. అతడు సృష్టి స్థితి లయ కారకుడైన పరమాత్మ. ఆయననే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ఉపాసించుకుంటారు. ఈ ఒక్క మాట ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటే వారూ క్షేమంగా ఉంటారు, సనాతన ధర్మం క్షేమంగా ఉంటుంది. సర్వ జీవులకూ నిజమైన గురువు, నిజమైన బంధువు, నిజమైన ఆత్మ, నిజమైన హృదయం భగవంతుడే. గతిర్భర్తా ప్రభుః సాక్షీ – భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. శివో గురుః శివో దేవః శివో బన్ధుః శరీరిణాం! శివాత్మా శివో జీవః శివాదన్యన్ న కించనా!!– స్కాందపురాణం. శరీరం కలిగిన ప్రతి వాడికీ శివుడే గురువు, శివుడే దేవుడు, శివుడే బంధువు, శివుడే ఆత్మ, శివుడే జీవుడు. లోకంలో బంధుత్వాలు ప్రారబ్ధాన్ని బట్టి వస్తూ, పోతూ ఉంటాయి. కానీ శివుడితో బంధుత్వం ఏనాడూ పోదు. బుద్ధికి ప్రేరణనిచ్చేవాడు గురువు అయితే ప్రతివారి హృదయంలో ఆ ప్రేరణ ఇచ్చే భగవానుడే గురువు. సర్వస్యచాహం హృది సన్నివిష్టో మత్తః స్స్మృతిర్జ్ఞానమపోహనంచ – కృష్ణ పరమాత్మ.

ఋషివాక్యం: నీతి నేతకు చాలా అవసరం

ఋషివాక్యం: నీతి నేతకు చాలా అవసరం

మైత్ర్యాదివాసనాలభ్యా - maitryādivāsanālabhyā

మైత్ర్యాదివాసనాలభ్యా - maitryādivāsanālabhyā

GURUJNANAM - శ్రీమద్భాగవతం పర్యావరణ సంరక్షణ – చెట్లు

శ్రీమద్భాగవతం పర్యావరణ సంరక్షణ – చెట్లు SRIMAD BHAGAVATAM Environmental Conservation- Trees

GURUJNANAM - శ్రీమద్భాగవతం పర్యావరణ సంరక్షణ – శబ్ద

SRIMAD BHAGAVATAM Environmental Conservation- Sound శ్రీమద్భాగవతం పర్యావరణ సంరక్షణ – శబ్ద

GURUJNANAM - శ్రీమద్భాగవతం పర్యావరణ సంరక్షణ – నదులు

SRIMAD BHAGAVATAM Environmental Conservation- River శ్రీమద్భాగవతం పర్యావరణ సంరక్షణ – నదులు

ఋషివాక్యం: అవివేకంతో కానీ ధర్మసేతువును భేదించరాదు – రామవాక్యం

లోభంతో కానీ, మోహంతో కానీ, అజ్ఞానంతో కానీ, అవివేకంతో కానీ ధర్మసేతువును భేదించరాదు – రామవాక్యం. న జాతు కామాన్ న భయాన్న లోభాత్ ధర్మం త్యజేజ్జీవితస్యాపి హేతోః!! నిత్యో ధర్మః సుఖదుఃఖే త్వనిత్యే జీవో నిత్యః హేతురస్య త్వనిత్యః!!(మహాభారతంలో వ్యాసదేవులు) తాత్కాలిక దుఃఖం సహించి అయినా ధర్మాన్ని పాటిస్తే అది శాశ్వతమైన సుఖాన్నిస్తున్నది. సుఖం ధర్మం యొక్క ఫలం, దుఃఖం పాపం యొక్క ఫలము. సుఖం చ న వినా ధర్మం, తస్మాత్ ధర్మ పరో భవేత్’ – ధర్మం లేనిదే సుఖం లేదు గనుక ఎప్పుడూ ధర్మబద్ధుడవై ఉండు. (శుక్రాచార్యులు)

ఋషివాక్యం: ధర్మకాలుష్యం

ఋషివాక్యం: ధర్మకాలుష్యం

ఋషివాక్యం: రాజనీతిప్రకాశం

మహర్షులు పురాణాల ద్వారా అందించిన జ్ఞానం మతవిషయం కాదు. మతాలు అంటూ పుట్టి పై దేశాలనుంచి వచ్చిన తర్వాత మనదైన జ్ఞానానికి మతం అని పేరు పెట్టాం. కానీ ఇది మతం కాదు, ప్రపంచానికి పనికివచ్చే జ్ఞానం. సనాతన ధర్మాన్ని మన భారతీయ పరిపాలనా విధానాలలోకి తెచ్చుకోగలిగితే మళ్ళీ భారతదేశం బాగుంటుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి ధర్మానికే హిందూ మతం అని పేరు పెడితే భారతదేశానికి హిందూ మతమే కావాలి, భారతదేశం హిందూమతరాజ్యమే కావాలి.

"నీలకంఠేశ్వరా!" శతకం పద్యం 19 - "Nilakanthesvaraa!" satakam padyam 19

తత్త్వతః జీవేశ్వరాభేదం సత్యం. కానీ ఉపాధి తాదాత్య్మం ఉన్నంత వరకు జీవభావం ఉంటుంది. ఈశ్వరుని సర్వజ్ఞత్వం ముందు తన కించిజ్ఞత్వాన్ని అంగీకరించి శరణు వేడాలి. ఇది భక్తి, ఉపాసన. చిన్న ఆపదకే బెంబేలెత్తే అల్పజీవుడ్ని నేను. ఆకాశమంత విషాన్ని హరాయించిన మహేశ్వరుడవు నీవు. నీ లీలలన్నీ నీ ఈశ్వర భావ ప్రకటనలే. అందులో ఇదొకటి. నీ సర్వాధిక్యానికి శరణాగతి. నీలకంఠేశ్వరా!

Mahishasura Mardini Stotram Slokam-11

Mahishasura Mardini Stotram Slokam-11

ఋషివాక్యం రాజధర్మం - సత్యం

ఋషివాక్యం ధర్మం రామవాక్యం

విద్ధిమామ్ ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాశ్రితమ్ – ధర్మమునందు మాత్రమే నిలబడి ఉంటాను గనుక నేను ఋషులతో సమానము (రామచంద్రమూర్తి కైకేయితో) భగవంతుడు మన కోరిక తీర్చాలంటే భగవంతుడి అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహం కావాలంటే సత్యాన్ని, ధర్మాన్ని ఆశ్రయించాలి.

Back